మొదటి పెజి
 పిఎఆర్/పిఆర్ఎ




అనువాదములు

'العربية / al-ʿarabīyah
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
తెలుగు /Telugu
Tiếng Việt

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు


వెల నిశ్చయించుటలో పాల్గొనటం అనే ప్రక్రియని సులభతరము చేయుట

సంఘము తనను తాను అంచనా వేసుకోవటానికి ఉత్తేజ పరచటం

రచన ఫిల్ బార్ట్లే, పిహెచ్ డి

అనువాదకులు - నిరుపమ ప్రతాప రెడ్డి


ఈ పనిని సులభతరము చేయువారికి వివరణ (నోట్సు)

ఒక సంఘములోని ప్రజలను తమ యొక్క అవసరములు మరియు వనరుల విలువ గురించి తమకు తామే అంచనా వేసుకునే ప్రక్రియలో పాల్గొనేలా ఉత్తేజ పరుచటానికీ మరియు ప్రోత్సహించటానికి ఈ పనిని సులభతరము చేయు వారు లేదా సంఘాన్ని చైతన్య వంతము చేసే మీరు ఏమి చేస్తారు?

ఒక సంఘములోని ప్రజలు అందరు కలిసి పాల్గొనటం యొక్క ప్రాముఖ్యత:

ఒక శక్తివంతమైన సమాజము నెలకొల్పటం కోసం ముఖ్యమైనది ఒక సంఘములోని ప్రజలందరూ కలిసి తమ సంఘము యొక్క ప్రగతిని ఒక పధ్ధతి ప్రకారం గమనించి, ఆ సమాచారమును భద్రపరిచి దానిని విశ్లేషించడం. ఆ ప్రజలను ఉత్తేజపరచి మరియు ఈ పధ్ధతి మొత్తం వారికి అర్ధం అయ్యేటట్టు సులభతరము చేయటం అన్న మీ పని ఇందులో ఎంతో ముఖ్యమైనది.

సంఘములోని ప్రజలందరికి ఒక స్పష్టమైన లక్ష్యం మరియు వారి వారి అవసరముల గురించి, సమస్యల గురించి, ఆస్తుల గురించి, మరియు వనరుల గురించి ఒక స్పష్టమైన అవగాహన లేనిదే, వున్న సమస్యలని ఎలా ఎదుర్కొనాలి, వేటికి మొదట పరిష్కారం కనుగొనాలి, మరియు అందరు కలిసి ఎలా పని చేసి బీదరికాన్ని ఎలా తగ్గించాలి మరియు అభివృద్ధి ఎలా సాధించాలి అన్న అంశముల మీద ఒక ఏకాభిప్రాయము వుండదు. మరింత సమాచారము కొరకు ఐక్యత ఏర్పాటు చేయడం చూడండి.

అందుకని ఒక సమన్వయకర్తగా మీ పని ఒక సమాజం యొక్క అభివృద్ధి కోసం ఎంతో ముఖ్యమైనది మరియు మీరు ఈ వెల నిశ్చయించుట అను పని సులభతరము చేసి సంఘములోని ప్రజలందరూ పాల్గొనే విధముగా చేయటం సమాజము ముందడుగు వేయటం కోసం ఎంతో ముఖ్యము.

మొత్తం సమస్య పరిష్కారములో మరియు సంఘమును శక్తివంతముగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఈ పధ్ధతి యొక్క భాగం ఏమిటి అనే దాని గురించి మరింత సమాచారము తెలుసుకోవడం కోసం పాల్గొనుట అంచనా మరియు పరిశోధన (ఈ విభాగము యొక్క ముఖ్య పత్రము) అనే పత్రము చదవండి.

మీకు కావలసిన నైపుణ్యాలు:

అన్నింటికంటే గొప్ప గురువు అనుభవము. ఒక వేళ మీకు ఈ పిఆర్ఎ(PRP) లేదా పిఎఆర్(PAR) పద్ధతిలో బాగా అనుభవం వుండి దానిని ఆచరించువారితో పనిచేసే అవకాసం గనుక వస్తే ఆ శిష్యరికం మీకు బాగా ఉపకరిస్తుంది.

ఒక వేళ అది కుదరక పోయినా లేక మీరు మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనుకున్నాగాని, మీరు ఎంత చదివితే అంత మంచిది, మీకు మీరే ఈ పద్ధతిని ఇతరులకు అర్ధం చేయటానికి కృషి చేయండి, తరువాత ఈ పద్ధతిని ఆచరించే ఇతరులతో కలిసి వారితో మీ అనుభవాలను పంచుకోండి మరియు మీరు సాధించిన ఫలితాలను వారు సాధించిన దానితో సరి చూసుకుని బేరీజు వేసుకోండి. ఒక మంచి సమన్వయకర్త ఎప్పుడూ చదవడం ఆపడు. ఈ స్వయంగా చదివే పత్రములో మీరు చదవగలిగినది ఏమిటి? ఈ వెబ్ సైట్లో మీరు చదవగలిగిన పత్రాలు చాలా వున్నాయి. అవి మీకు కొన్ని సూత్రాల మీద పట్టు రావడానికి పనికివస్తాయి మరియు ముఖ్యముగా కొన్ని పద్ధతులు మరియు కొన్ని నైపుణ్యాలు మీకు రావడానికి దోహదపడతాయి.

ఉదాహరణకి, పిఆర్ఎ (PRA) పధ్ధతి తాలూకు “ఎందుకు” మరియు “ఎలా” అనే అంశాలను శోదించడానికి నేపాల్ లో వున్న కమల్ ఫుయాల్ గారిచే రాయబడిన, ఆనందాన్ని పంచుకోవడం, పిఆర్ఎ (PRA) ని పంచుకోవడం, అనే వ్యాసాన్ని చదవండి.

బాగా ఆలోచించిన తరువాత తయారు చేయబడిన పద్ధతుల మరియు మీరు ఏ విధానాలను అవలంబించాలి అనే పట్టీ కోసం బెన్ ఫ్లెమింగ్ గారిచే తయారు చేయబడిన పాల్గొనుట పత్రాన్ని చూడండి.

ఒక సమన్వయకర్తగా ఎలా వుండాలి అనే పత్రాన్ని కూడా చూడండి, అందులో సమన్వయకర్తకి ఉండవలసిన లక్షణాలు అనే విభాగమును చూడండి.

ఒక సమస్యకు సమాధానము కనుగొనడానికి ఎలా ఆలోచించాలి అన్న విషయానికి మేధోమధనము అనే విభాగాన్ని చూడండి. అందులో పొందుపరచిన వివిధ పద్ధతులు వెల అంచనావేయు ఈ ఘట్టములో ఎంతో ఉపయోగ పడతాయి.

మీకు ఇంటర్నెట్ సదుపాయం గనక బాగా ఉన్నట్టయితే మీరు ఇతర విశేషాల కొరకు అనుసంధానాలు మరియు ఇతర పేజిలతో మీ పరిశోధన మొదలు పెట్టవచ్చు. ఈ విషయం మీద సమాచారం ఉన్న ఇతర వెబ్ సైట్లల్లో ఉన్న సమాచారమును కూడా చదవండి. ఒక అనుక్రమములో ఉన్న పత్రాలు సస్సెక్స్, ఇంగ్లండ్ లోవున్న ఐడిఎస్ (IDS)-ఇన్స్టిట్యూట్ అఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ద్వారా దొరుకుతాయి. అందులో ఈ పాల్గొనుట అను పద్ధతిని నలుగురికి తెలియ చెప్పడములో ముఖ్యులుగా చెప్పబడిన రాబర్ట్ చాంబర్స్ గారిచే రాయబడిన పత్రాలు కూడా దొరుకుతాయి. ఒక వేళ మీకు విశ్వవిద్యాలయాల గ్రంధాలయాలకు ప్రవేశము గనక లేకపోతే ఇంటర్నెట్లో ఇతర మార్గాల శిక్షణ పత్రులు చాలా ఉన్నాయి. మీరు ఆ ఇంటర్నెట్లోని విషయాలను పరిశోధన చేయాలి. ముఖ్యముగా అత్యుత్తమమైన పద్ధతి ఏమిటంటే మీరు పాటించవలసిన పధ్ధతులను చేయండి, ఆ విషయాలను ఇతరులతో పంచుకోండి మళ్ళీ సరిదిద్దిన పాటించవలసిన పధ్ధతులను చేయండి.

అంటే మీరు వెంటనే పనిలోకి దూకాలి మరియు ఈ విభాగములో చెప్పబడినట్టుగా సమన్వయ పరచాలి మరియు ఇతరులకు ఈ పని సులభము చేయాలి అంటే మీరు మీ అనుభవాలను సంఘములో వున్న ఇతర కార్యకర్తలతో పంచుకోవాలి, తరువాత వెళ్లి ఇంకా ఎక్కువ పని చేయాలి. కార్యకర్తలతో కూడిన శిక్షణా కార్యక్రమాలలో మరియు చర్చావేదికలలో పాల్గొనటం అన్నది మీకు ఎప్పుడు, ఎలా కుదిరినా కూడా తప్పకుండా చేయవలసిన విషయం.

మీరు మంచి నాయకుడిగా పనిచేయడం ముఖ్యమే, ముఖ్యముగా సంఘమును ముందుకు నడిపించి పటము తయారు చేయడము మరియు సమావేశము ఏర్పాటు చేసి పట్టిక తయారుచేయించడము లాంటి వాటికి పురిగోల్పడము లాంటివి. నాయకత్వము ముఖ్యమే అయినా కూడా అందరిని పాల్గొనటం కోసం ఉత్తేజింప చేయడం కూడా ముఖ్యమే. వారి వనరులు మరియు వారి వారి అవసరముల మీద మీకు వున్నా ఆలోచనలను వారి మీద రుద్ద కూడదు.

ఏకాభిప్రాయము మరియు ఐఖ్యత ( ఐఖ్యత కోసం ఉత్తేజ పరచటంఅన్న అంశమును చూడండి) సాధించడం కోసం జాగ్రత్తగా కృషి చేయండి మరియు చేస్తున్న పని పారదర్సాకముగా మరియు నీతిమంతముగా వుండేటట్టు చూసుకోండి. సంఘమునకు మీరు చూపించాల్సింది ఏమిటంటే వారి పని యొక్క ఫలితము (పాఠం మరియు పట్టిక) వారి సంఘము లేక వారి సమాజము యొక్క ఉత్పత్తి అంతే గాని ఎవరో కొంతమంది లేక కొన్ని శక్తులు స్వార్ధముతో ఏదో ఫలితము ఆశించి చేసినది కాదు అని.

మీరు ఎలా పని చేయాలి అని, లేదా మీ పద్ధతులను ఎలా మెరుగు పరుచుకోవాలి అని తెలిపే శిక్షణా సామగ్రి కోసం మీ అన్వేషణలో సమన్వయకర్తల శిక్షణా కరపత్రము అను కంప్యూటర్ పత్రమును ఏదైతే ఈ వెబ్ సైట్లో వుందో దాన్ని మర్చి పోవద్దు. అందులో సమన్వయకర్తగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడము గురించి ఉన్న అధ్యాయాలను చూడండి.

క్లుప్తముగా చెప్పాలి అంటే ఈ వెబ్ సైట్లో ఈ విభాగము అవతల ఉన్న ఇతర శిక్షణ పత్రాలు ఏమిటంటే: మేధోమధనము, పాల్గొనటం, పిఆర్ఎ(PRA)ని పంచు కొనటం, ఐక్యత ఏర్పాటు చేయడం, సమన్వయకర్తగా వుండాలి అంటే ఏమి చేయాలి మరియు సమన్వయకర్తల కరపత్రము.

––»«––

సంఘము యొక్క ఆస్తులు మరియు అవసరముల వెల నిశ్చయించడం:


సంఘము యొక్క ఆస్తులు మరియు అవసరముల వెల నిశ్చయించడం

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి

 వెల నిశ్చయిన్చుటలో పాల్గొనుట